నిరుద్యోగ యువతకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణకు దరఖాస్తులు!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త! సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి
ఈ నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, రెజ్యూమె బిల్డింగ్, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మార్క్ ఎంటర్ప్రైజెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, మెంటల్ వెల్ బీయింగ్ వంటి వివిధ అంశాలపై దృష్టి సారిస్తుంది
శిక్షణ వివరాలు:
అర్హత: డిగ్రీ పూర్తి చేసిన 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు గల ఏ కులానికైనా చెందిన వారు అర్హులు
. ఆదాయ పరిమితి: 1.5 లక్షల నుండి 2 లక్షల లోపు ఆదాయ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి
. ప్రయాణ భత్యం: శిక్షణ సమయంలో అభ్యర్థులకు ట్రావెల్ అలవెన్స్, భోజనం మరియు వసతి సౌకర్యాలు కల్పించబడతాయి
. దరఖాస్తు వెబ్‌సైట్: అర్హులైన అభ్యర్థులు tgbmmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
. చివరి తేదీ: దరఖాస్తు ఫారాలను ఆయా జిల్లాలోని డీసీ డెవలప్‌మెంట్ అధికారికి జూలై 14వ తేదీలోగా అందజేయాలి
.
No comments:
Post a Comment